ఈ సంవత్సరం ఇండియాలో యూత్ ని ప్రభావితం చేసింది ఎవరు అని ఓ సంస్థ సర్వే చేస్తే ఈలిస్టులో అమితాబ్ బచ్చన్ మొదటి స్థానంలోనూ దీపికా పడుకొనే రెండో స్థానంలోనూ ఉన్నారట. మిగతా స్థానాల్లో కూడా నటులు ,క్రీడాకారులే ఉన్నారు. నిజానికి అమితాబ్ స్ఫూర్తిదాతగానే ఉన్నారు. నాలుగు దశాబ్దాలలో 180 సినిమాలు చేశారు.15 ఫిలిం ఫేర్ అవార్డులు,జాతీయ స్థాయి ఉత్తమ నటుడు ,ప్రభుత్వం తరుపున ఉత్తమ పురష్కారాలు అందుకొని కెరీర్ లో అద్భుతమైన స్థానంలో ఉన్నారు. రైతుల కోసం విరాళాలు అందించారు. అలాగే దీపికా భారతీయ సూపర్ మోడల్ ,బాలీవుడ్ నటి ,ఎన్నో సంస్ధలకు బ్రాండ్ అంబాసిడర్ ,ఎన్నో అవార్డులు గెలుచుకొన్న విజేత. 32 సంవత్పరాల వయస్సులో అత్యంత పారితోషికం అందుకొనే ఉత్తమ నటి.వీళ్ళకు యువత స్ఫూర్తి మరి!.

Leave a comment