మీటూ ఒక ఫ్యాషన్ అంతే .అది ఎక్కవ కాలం నిలబడదు అని మలయాళ నటుడు మోహాన్ లాల్ చేసిన కామెంట్ కు స్పందిస్తూ నటి రేవతి ట్వీట్ చేసింది. మీటూ ఒక ఫ్యాషన్ అన్నారు ఒక పాపులర్ యాక్టర్ .అలాంటి వాళ్ళలో సున్నితత్వం ఊహించగలమా? దర్శకురాలు అంజలీ మీనన్ చెప్పినట్లు వేధింపులకు గురి అవ్వటం అంటే ఏమిటో మగవాళ్ళకు తెలయదు. బహుశవాళ్ళంతా గ్రహాంతర వాసులు లాంటివాళ్ళు. తమకు జరిగిన చేదు అనుభవాలు ప్రస్తావించేందుకు ఎంతో ధైర్యం కావాలి వాళ్ళు ఊహించుకోలేదు. అది ఎలాంటి మార్పు తీసుకోస్తోంది కూడా వాళ్ళకు తెలియదు కదా అని ట్వీట్ చేసింది రేవతి.

Leave a comment