మోడ్రన్ డిజైన్స్ పేరు చెపితే రీతూ కుమార్ పేరు ముందుంటుంది. అనేక దశాబ్దాలుగా ఫ్యాషన్ రంగంలో ఉన్న ఆమెలో క్రియేటివిటీ కొంచెం కూడా తగ్గలేదు. ఇటీవలే ఎవర్స్టోన్ కాపిటల్ నుంచి అందిన వంద కోట్ల పెట్టుబడిలో రీతూ కుమార్ ఇంకో మూడు కొత్త బ్రాండ్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. దుబాయ్ లో పారిస్ లో ఆమె షాపులున్నాయి. సొంత డిజైన్ వ్యాపారంతో  పాటు హ్యాండ్ లూమ్ బోర్డ్స్ , వీవర్స్ సర్వీస్ సెంటర్స్ బోర్డు లో సభ్యురాలిగా ఉన్నారు. వారణాసి ,బీహార్ ,ఒరిస్సా లోని సంప్రదాయ డిజైన్లకు ప్రచారం తీసుకొచ్చారు. రీతూకుమార్. ఫ్యాషన్ డిజైనింగ్ ఇది అంతం అంటూ ఉండదు అంటారామె. ఆన్ లైన్లో ఆమె డిజైన్స్ కళ్ళు చెదిరేలా వుంటాయి. లక్షరూపాయల పైమాటే ఒక్కో చీర. బెనారెసీ ,ఒవేన్ రెడ్ గోల్డెన్ శారీస్  , రిచ్ గోల్డెన్  శారీ, ఎమరాల్డ్ మిర్రర్ వర్క్ శారీస్ , కోరల్ ఎంబ్రాయిడరీ చీరలు ఐవరీ గోటూ బ్లింక్ ఎంబ్రాయిడరీ చీరలు ఇవన్నీ  రియల్ జరీ వర్క్ లు , రాయల్ లుక్ తో పార్టీలకు ,పెళ్లిళ్లకు, ఫెస్టివల్స్ కు రైట్  అవుట్ ఫిట్స్  కుర్తీలు ,సూట్స్ ,శారీస్ ,బాటమ్స్ , లెహెంగాస్ ఈ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రీతూ కుమార్ చేతుల్లోంచి ఫ్యాషన్ వీక్ లో మెరిసి అమ్మాయిల కళ్ళలో పడిపోయి బెస్ట్ సెల్లింగ్ అయిపోతాయి.

Leave a comment