Categories
భారత దేశం హస్త కళలకు ప్రసిద్ధి. ఒక్క ప్రాంతంలో ఒక్క ప్రత్యేక తరహా హస్తకాలున్నాయి . ఆ కళారూపాలన్నీ ఢిల్లీలోని నేషనల్ హ్యాండ్ క్రాఫ్ట్ మ్యూజియం లో చూడచ్చు మొత్తం 33 వేల నమూనాలున్నాయి . కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత భూభాగంలోని గుజరాత్ నుంచి ఈశాన్యం లోని త్రిపుర మేఘాలయ వరకు లభించే అద్భుత హస్తకళా రూపాలు ఇక్కడుంటాయి. అన్ని రకాల చేనేతలు కలంకారీ జమునార్,ఇకత్ బలుబర్ ఎంబ్రాయిడరీలు,గిరిజన నేతలు,లోహాలతో చేసిన దీపాలు,రాకు శిల్పాలు,వెదురు బొమ్మల శిల్పాలు,గిరిజన హస్తకళలు మట్టి పాత్రలు ,మట్టి బొమ్మలు మొత్తం ఇక్కడే వున్నాయి. ఎన్నో ప్రాంతాలలోని గృహ నిర్మాణాలు కూడా ఇక్కడే చూడచ్చు దేశం మొత్తం చూడలేకపోతే ఇక్కడ భారతీయ హస్తకళా దర్శనం చేయచ్చు.