Categories
జిమ్ నుంచి ,లేదా ఏ వాకింగ్ నుంచి వచ్చి రాగానే ఆఫీస్ కు పరుగెత్త వలసి ఉంటుంది . వ్యాయామం తర్వాత చమటలు పోస్తాయి . ఎందుకంటే శారీరక ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటుంది . కోర్ టెంపరేచర్ తగ్గితేనే చమటలు తగ్గుతాయి . ఈ చమటలు పోయకుండా ఉండాలంటే వర్కవుట్ తర్వాత చల్లని నీళ్ళు తాగాలి . 15 నిముషాలైనా చల్లని నీటిలో షవర్ చేయాలి . చెమట తగ్గేందుకు హడావుడి ప్రయత్నాలు చేయనక్కర్లేదు . పదిహేను నిముషాల స్నానంలో శరీరం యధాస్థితికి చేరుకొని చమటలు తగ్గుతాయి . వాకింగ్ నుంచి రాగానే నాలుగైదు నిముషాలు విశ్రాంతిగా కూర్చున్నా చాలు .