ఏ వస్తువైన బ్రాండ్ ఇమేజ్‌ సాధించాలంటే కలర్ ఫుల్ ప్రమోషన్ ఉండాలి. ఇప్పుడు పాపులర్ అయిన ఎన్నో చాక్లెట్లు, దుస్తులు, పిజ్జాలు, ముబైల్స్ అన్నింటికి బాలీవుడ్ హీరోలు, క్రికెట్ స్టార్స్ అంబాసిడర్లుగా ఉన్నారు. ప్రస్థుతం మనదేశంలో హీరోయిన్లలో దీపికపడుకునే ఎక్కువ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉంది. గత సంవత్సరం లెక్కల ప్రకారం ఆమె 18 బ్రాండ్లకు అంబాసిడర్. ఈ ఏడాది 20 కంటే ఎక్కువే. ఒక్కో బ్రాండ్ కు ఆమె ఐదు నుంచి 10 కోట్లు పారితోషికంగా అందుకుంటుంది. అంటే కేవలం ఈ బ్రాండ్ల ద్వారానే ఆమె దాదాపు 150 కోట్ల ఆదాయం గణిస్తుందంటున్నారు. అంటే సినిమా సంపాదన కంటే ఎక్కువ మంది ఆమె సంపన్నురాలు అనే కంటే శక్తివంతురాలు ఎండార్స్ మెంట్ల రాణి అనవచ్చుకదా.

Leave a comment