మహిళలరక్షణ కోసం హాక్ ఐ మోబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు హైదరాబాద్ పోలీసులు . ఈ  హాక్ ఐయాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకున్నాక ,దానిలో పేరు ,మొబైల్ నంబర్ ఈ మెయిల్ ఐ డి నమోదు చేయాలి . ఎలాటి పరిస్థితిలో ఎక్కడ ఉన్నా  ఆ చోటు నుంచే  ఈ యాప్ ఉపయోగించి రక్షణ పొందవచ్చు . యాప్ లోని ఎస్ ఓ ఎస్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆపదలో ఉన్న సమాచారం మనం ఫీడ్ చేసుకొన్నా ఐదుగురు వ్యక్తులతో పాటు దగ్గరలో ఉన్నా పోలీస్ స్టేషన్,పెట్రోలింగ్ సిబ్బందికి అందుతుంది . వారు నిముషాల్లో లొకేషన్ కు చేరుకుంటారు .

Leave a comment