Categories
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ లో నీలకంట్ గ్రామంలో ఉన్న నీలకంటేశ్వరాలయానికి వెళ్ళి త్రిమూర్తులని దర్శనం చేసుకుని వద్దాం పదండి.
ఈ ఆలయం శాలివాహన రాజుల సృష్టి అని తరువాత కాకతీయుల వశమై వారి పరిపాలనలో ప్రసిద్ధి చెందింది.ఇక్కడ సృష్టి-స్తితి-లయకర్తల స్వయంభూ దర్శన భాగ్యం కలుగుతుంది. లింగ రూపంలో శివుడు, శేషశయనుడిగా శ్రీ మహావిష్ణువు, విష్ణువు నాభిలో నుండి ఉద్భవించిన బ్రహ్మ పూజలు అంగరంగ వైభవంగా అందుకుంటుంన్నారు.
ఈ క్షేత్రంలో నీలకంటేశ్వరునికి అన్ని పర్వదినాలలో శాస్త్రీయంగా జరుగుతాయి.అందుకే ఈ గ్రామానికి నీలకంట్ అని పేరు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాభిషేకం,పులిహోర,దద్ధోజనం,పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం.
-తోలేటి వెంకట శిరీష