మిస్ వరల్డ్ 2019 గా జమైకాకు చెందిన టోనీ ఆన్ సింగ్ ఎంపికైంది . 23 ఏళ్ళ ఈ నల్లజాతి వజ్రం 111 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలతో పోటీ పడి కిరీటం గెల్చుకున్నారు . లండన్లోని ఎక్స్ ల్ కన్వెన్షల్ సెంటర్ లో జరిగిన భారీ వేడుకల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించింది టోనీ ఆన్ సింగ్. ఈ విజయం తనకు ,తనలాంటి నల్లజాతి బాలికలకు సొంతమని టోనీ చెపుతుంది . స్రీల సమానత్వం కోసం నేను చేయగలిగిన దంతా చేస్తాను అంటూ ప్రకటించింది మిస్ వరల్డ్ టోనీ ఆన్ సింగ్. ఫ్లోరిడా యూనివర్సటీలో మిమెన్స్ స్టడీ లో గ్రాడ్యుయేషన్ చేసింది టోనీ.