కేరళ కు చెందిన రమ్య హరిదాస్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పుకోవాలి . రాజకీయాలంటేనే డబ్బు అందులో రాణించాలంటే డబ్బు వెదజల్లాలి . అలాటిది విరాళాలతో కేరళ లోని అలాతూర్ నియోజక వర్గం నుంచి ఎన్నికల్లో నెగ్గింది రమ్య హరిదాస్ . రాహుల్ గాంధీ నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ చూపింది . ఈమె ఎం.పి టికెట్ సంపాదించారు . డప్పు కొడుతూ ,పాటలు పాడుతూ క్రేడ్ ఫండింగ్ ద్వారా పది లక్షలు రూపాయిలు సేకరించి ఆ విరాళాలతో ఎలక్షన్ ఖర్చులు భరించింది . అతి సాధారణ కుటుంబానికి చెందిన రమ్య ఎంతో కష్టపడి ఈ స్థాయి కి వచ్చింది . ఆమె సందేహం లేకుండా యువతకు స్ఫూర్తి ప్రదాత .