దేవతలకే కాదు రక్షేసులకు కూడా గుళ్ళు వుంటాయి అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఉత్తరాదిలో హిడింబా దేవి గుడి ఉంది. మహాభారతం లో హిడింబ,హిడింబాసురుడి చెల్లలు. బీముడి భార్య ఘటోత్కచుడి తల్లి.  ఘటోత్కచుడు పెద్దవాడై రాజ్య పరిపాలన బాధ్యత తీసుకున్నాక హిడింబ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి దివ్య శక్తులు పొందింది కోరికలు తీర్చే దేవతగా మారింది. పూజలు అందుకొంది. అదీ ఈ గుడి విశేషం. 1553 లో మహారాజా బహద్దూర్ సింగ్ హిడింబ పేరిట పగోరా తరహాలో ఒక చక్కని ఆలయం నిర్మించాడు. ప్రకృతి వైపరీత్యాలు,సామజిక వ్యక్తిగత సమస్యలకు ప్రజలు అక్కడికి వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. బలులతో పూజ తీవ్రస్థాయిలో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ముఖ్య పర్యాటక స్థలాల్లో ఇది ఒకటి.

Leave a comment