ఆటిజమ్ : చిన్న పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి విఘాతం కలిగిస్తుంది .
ఆటిజమ్ ఉన్న పిల్లలు ఇతరులతో సరిగ్గా కలవ లేక పోవడం,మాట్లాడ లేక పోవడం ,అందరితో ఉండ లేకపోవడం , నేర్చుకోలేక పోవడం ఉంటుంది .
పిల్లల్లో పెంపొందే ఆటిజమ్ గురించి తల్లి దండ్రులకు సరైన అవగాహన ఉండాలి
ఆటిజమ్ అరవై (60 )మందిలో ఒకరికి ఉంటుంది . (1)ఇది “0-3” సంసంవత్సరాల వయస్సు లోపు ప్రారంభమయ్యే ఒక “న్యూరో డెవలప్ మెంట్ ” డిజార్డర్ . ప్రస్తుతం అన్ని దేశాల్లో జాతి ,మత,కుల ,పేద ధనిక తేడా లేకుండా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య .
మాటలు లేకపోవడం,వయస్సు కి తగ్గట్టు విషయ జ్ఞానం పెంపొందక పోవడం ,పలుమార్లు ఒకే రకంగా ప్రవర్తించడం ,అనవసర వస్తువులపై ఎక్కువ ఆశక్తి పెంపొందించు కోవడం వంటి లక్షణాలుంటాయి .
గర్భిణీ సమయంలో వాడకూడని మందులు వాడడం ,కొన్ని రకమైన ఇన్ఫెక్షన్లు ,ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టరీస్ ,జన్యుపరమైన లోపాలు ఆటిజమ్ కి కొన్ని ముఖ్య కారణాలు.
ఆటిజమ్ ఉన్న పిల్లల్లో స్పీచ్ థెరఫీ ,బిహేవియర్ థెరఫీ ,ఫిజియో థెరఫీ అందించటం వల్ల వాళ్ళు త్వరగా ఈ డిజార్డర్ నుండి కోలుకుంటారు
కె . వినోద్ కుమార్
క్లినికల్ సైకాలజిస్టు
ఫోన్ . నెం ; 9398141041