Categories
ఇప్పుడైతే బంగారం వజ్రాలు,విలువైన రాళ్ళు ఆభరణాల కోసంగా ఉపయోగిస్తున్నారు కానీ ఒకపుడు అవన్నీ కరెన్సీ వాణిజ్య వ్యాపార మార్పిడి కోసం ఉపయోగించారు. 17 వ శతాబ్దం నుంచి అందమైన వజ్రాలను వెండిలో పొదిగి చక్కని నగలు తయారు చేశాక నెమ్మదిగా వాటిని ధరించటంపైనే మోజు పెరిగింది. వజ్రాల ధగధగలు కలకాలం నిలిచి ఉంటాయి. నగల మార్పిడి సమయంలో కూడా నష్టపోవటం ఉండదు. ఇవ్వాల్టి రోజుల్లో పాతకాలపు సాంప్రదాయ డిజైన్లనే ఇష్టపడుతున్నారు నవరత్నాల స్టోన్స్. డైమండ్స్ కలిపిన గాజులు లేటెస్ట్ ఫ్యాషన్. నల్లపూసల్లో డైమండ్ పెండెంట్ కూడా వాడుకలో ఉంది. పూర్తిగా వజ్రాలే కాకుండా ఎమ్ రాల్డ్ జోడించి చేసిన నగలు చూసేందుకు చాలా బావున్నాయి.