Categories
ఈ సంక్రాంతి ని అందరు బెల్లపు అరిసెలు,పరమాన్నం చేస్తూ ఉంటారు. పిండి వంటలకు రుచిని ఇచ్చే ఈ బెల్లం ఈ సీజన్ లో ఎక్కువగా వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి తీపి పదార్ధాల్లో వేసేందుకు బెల్లాన్ని ఇనుప పాత్రలో వండితే ఇనుము సంవృద్ధిగా అందుతోంది. హిమోగ్లోబిన్ స స్థాయిలు పెరుగుతాయి. బెల్లంలో ఇనుము,మెగ్నీషియం,కాల్షియం వంటి ఖనిజాలు,బికాంప్లెక్స్ విటమిన్లు సంవృద్ధిగా ఉంటాయి. బెల్లం పాకంలో మిరియాల పొడి వేసి తాగితే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతోంది. చెరుకు బెల్లం,తాటి బెల్లం,ఖర్జుర బెల్లం,ఈత బెల్లం,కొబ్బరి బెల్లం అంటూ ఎన్నోరకాల బెల్లాలు దొరుకుతున్నాయి. ఏ బెల్లమయినా పంచదార కంటే ఎక్కువ మేలు చేస్తుంది. ఎన్నో రకాల ఔషధాల్లో బెల్లం ముఖ్య పదార్ధంగా వుంటుంది.