ఓ బొజ్జ గణపయ్య…వందనాలు
అందుకోవయ్య!!
చల్లంగా జూడవయ్య…మరల నీ రాకకై
ఎదురు చూతమయ్య!!
ఈ రోజు గణపతి శోభాయాత్రతో కళకళలాడుతూ భక్తులు ఆనందంగా నృత్యాలు చేయడం.వివిధ రకాల ప్రసాదాలు తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు.గణపతిదేవునికి భక్తులు ఎంత సంతోషంగా ఉంటే అన్ని వరాలు ప్రసాదిస్తాడు.ముఖ్యంగా విద్యార్థులు భక్తి శ్రద్ధలతో పూజించి అనుగ్రహం పొందుతారు.
విద్యార్థులు తమ స్వహస్తాలతో గణపతి విగ్రహం మట్టితో తయారు చేసిన 9 రోజులు వైభవంగా పూజలు అందుకుంటాడు.విద్యార్థి దశ అంటే గణపతి కి చాలా ఇష్టం. వాహనాలను చూడముచ్చటగా అలంకరించి గణపతిని ఊరేగింపుతో నిమజ్జనానికి బయలుదేరుతారు.
నిత్య ప్రసాదం: నీళ్ళతో వారు పోసి, కొబ్బరి కాయ కొట్టి, హారతి ఇవ్వడం.
రకరకాల పువ్వులు, జిలేబి,రవ్వ లడ్డు, పులిహోర ప్రసాదాలతో వినాయకుడి శోభాయాత్ర సాగుతుంది.
సర్వే జనా సుఖినో భవంతు!!
-తోలేటి వెంకట శిరీష