Categories
ఇల్లంటే ఒక వంటిల్లు, కూర్చునేందుకు హాలు, పడుకొనేందుకు వీలు గా ఉంటుంది. అంటే ఇల్లు కట్టేందుకు తగినంత స్థలం కావాలి . కానీ ఢిల్లీ కి చెందిన ఒక వ్యక్తి ఆరుగజాల్లో అందమైన ఇల్లు కట్టేరు. ఈ ఆరుగజాల్లోనే వంట ఇల్లు స్నానాల గది , పడకగదులు కలిగిన ఇల్లు నిర్మించాడు . ఈ మూడంతస్థుల ఇంట్లో ప్రస్తుతం నాలుగు కుటుంబాలు ఉన్నాయట ,అంటే కాస్త సర్దుకోక తప్పదనుకోండి, పెరిగిపోతున్న జనాభాకి, తరిగిపోతున్న భూమిని ఎలా వాడుకోవాలో చెప్పినట్లయింది . ఈ ఆరుగజాల జాగాలో ఇల్లు . ఈ ఇల్లు చూసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారట . అంతేకదా అంత చిన్ని చోట్లో వసతిగా ఉండే ఇల్లంటే మాటలా ?