దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మాస్వరాజ్ కు లభించింది. ఏడు సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా,మూడు సార్లు శాసన సభ్యురాలుగా ఎన్నికయ్యారు 1977 లో 28 సంవత్సరాల వయసులో క్యాబినెట్ మంత్రి గా చేసారు సుష్మా. 27 సంవత్సరాల వయసులో జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. 1987 నుంచి 1990 వరకు ఆమె హర్యానా రాష్ట్ర విద్య మంత్రిగా ఉన్నారు.