బంగారం కొనేప్పుడు ఆచితూచి వ్యవహరించండి అంటున్నారు ఎక్సపర్ట్స్. హాల్ మార్క్ లేకుండా విక్రయించే ఆభరణాల్లో బంగారం 18 క్యారెట్ల కు మించి ఉండదని ఒక అంచనా బంగారం ప్యూరిటీ తెలియజేసే హాల్ మార్క్ ముద్ర ఉందో లేదో చూసుకోవాలి. బి ఐ ఎస్ నిబంధన ప్రకారం రాళ్ల బరువు బంగారం బరువు విడివిడిగా లెక్క వేయాలి. ఈ వివరాలు రసీదు లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. పచ్చలు రూబీ లు వంటి విలువైన రాళ్లు నగల్లో ఉంటే వాటిని మారిస్తే ఎంత శాతం తిరిగి వస్తుందో అది రసీదు లో వేయించుకోవాలి. ఈ రసీదు కంప్యూటర్ బిల్లు అయితే మంచిది ఒకవేళ అది లేకపోతే దుకాణం వివరాలు రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్ వాయిస్ కాయితం పైనే రసీదు తీసుకోవాలి బిల్లు తప్పనిసరిగా దాచుకోవాలి.

Leave a comment