ఇంట్లో ఇస్త్రీ చేస్తూ ఉంటే ఒక్కసారి వేడి ఎక్కువై దుస్తులు కాలిపోవటం ఐరన్ బాక్స్ పైన అవి అతుక్కుపోయి మరకలు పడటం సర్వ సాధారణం . ఆ మరకలు పూవు సరికదా వేరే దుస్తులు  ఇస్త్రీ చేస్తుంటే అతుక్కుని అవీ పాడవుతుంటాయి. ఒక చిన్న చిట్కా ఉపయోగిస్తే మరకలు పోతాయి. ఒక పల్చని క్లాత్ పైన ఒక గ్లాసు ఉప్పును పొరలుగా పరిచి ఐరన్ బాక్స్ ను మాక్సిమం వేడిచేసి దానితోఉప్పు పైన రుద్దితే దానిపైన ఉన్న మారకలన్నీ మాయం అవుతాయి. ఐరన్ బాక్స్ చల్లారాక దానిపైన ఉప్పు పాత  గుడ్డతో తుడిచేస్తే సరి. అలాగే వైట్ వెనిగర్ వేడిచేసి అందులో క్లాత్ ను ముంచి దానితో ఐరన్ బాక్స్ ప్లేట్ శుభ్రం చేయచ్చు. వెనిగర్ వల్ల మరకలు పూర్తిగా పోలేదనిపిస్తే టేబుల్ సాల్ట్ కానీ బేకింగ్ సోడాను వేడిగా ఉన్న లైట్ ఐరన్  బాక్స్ ను తుడిస్తే మెరిసి పోతుంది. హైడ్రోజన్ పెరాక్సిడ్ తో గానీ టూత్ పేస్ట్ తో గానీ ఏ మరకలు పోగొట్టచ్చు. కొన్ని వస్తువులు ఎంతకాలం వాడినా కొత్తవిగా కనిపించాలంటే ఇలాంటి చిట్కాలు ఉపయోగించాలి మరి.

Leave a comment