చీకటి గదుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు వాడ వద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ,ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే నీలపు కాంతిని కనుగుడ్డు లేదా లోపలి కార్నియా నిరోధించ లేవు. అలాగే వాటిని వెనక్కి కూగా పంపలేవు. నేరుగా రెటీనా పైన పడే ఈ నీలపు కాంతి కంటి చూపును దెబ్బతీస్తుంది. కంటిచూపు బాగుండాలంటే రిటైనల్ మాలిక్యూల్స్ నిరంతర సరఫరా జరగాలి. ఈ మాలి క్యూల్స్ కంటిలోపల తయారవుతాయి. ఈ కంటి లోపలి కాంతి గ్రాహాక కణాలు ఒక సారి మరణిస్తే తిరిగి ఏర్పడవు.అందుకే చీకటిలో నీలపు కాంతిని ప్రసరించే ఎలక్ట్రానిక్ పరికరాలు వాడవద్దు.

Leave a comment