Categories
రెండు నెలల పాపాయి ఉన్నప్పుడే యాసిడ్ దాడికి గురైంది అన్ మోల్ . ఆడపిల్ల పుటిందని భార్యలను బిడ్డను చంపేయాలను కొన్నాడు తండ్రి . బిడ్డకు పాలిస్తున్నా తల్లి ,పాలు తాగుతున్నా బిడ్డపైనా యాసిడ్ గుమ్మరించాడు . అన్ మోల్ తల్లి అక్కడిక్కకడే చనిపోయింది . రెండు నెలల అన్ మోల్ బతికింది అంతులేని గాయాలతో సంవత్సరాల తరబడి ఎన్నో ఆపరేషన్లు జరిగాక,బాల్యం మొత్తం హాస్పిటల్ బెడ్ పైన గడిపాక మొహం రూపాన్ని పోగొట్టుకొని బతికి బయటపడింది అన్ మోల్. అనాదశరణాలయంలో పెరిగింది . కాలేజ్ చదివి పూర్తిచేసి ఫ్యాషన్ రంగాన్ని కెరీర్ గా ఎంచుకోండి . ఇప్పుడామె సక్సస్ ఫుల్ మోడల్ . మోడలింగ్ చేస్తూ మరో ఇరవై మంది యాసిడ్ సర్వైవర్స్ కి సాయం చేసింది .