కరాగ్రే వసతే లక్ష్మీ…అంటూ మనం నిద్ర లేవటంతోనే లక్ష్మీదేవిని స్మరిస్తూ లేస్తాం.పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పూజ ఎంతో మంచి సత్ఫలితాలిస్తుంది.

క్షీరసాగర మధనంలో నుండి లక్ష్మీదేవి జన్మించినది అని,భృగు మహర్షి కుమార్తె అని విష్ణు పురాణంలో చెప్పారు.ప్రతి నిత్యం మనం దేవతామూర్తుల ఆరాధన చేస్తూనే వుండాలి.లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి శుచి,శుభ్రంగా వుండాలి.ఇల్లు శుభ్రంగా వుంచుకోవాలి.వాకిలి కడిగి రంగవల్లులు తీర్చిదిద్దాలి.దాన ధర్మాలు చేయాలి.ఇంటికి వచ్చిన అతిథులను మర్యాదగా వ్యవహరించడం చాలా అవసరం.

నిత్య ప్రసాదం:కొబ్బరి,పొంగలి,పాయసం

           -తోలేటి వెంకట శిరీష
       

Leave a comment