పాఠకుల నోరూరించే తెలుగు విందు వంశీ ‘ నల్ల మిల్లోరి పాలెం కథలు ‘ అన్నారు డాక్టర్ జంపాల చౌదరి. ఈ కథల గురించి చెప్పాలంటే ఇవి వంశీ శైలిలో వివిధ పార్ష్వాలకు ఉదాహరణలుగా నిలుస్తాయి. కొన్ని కథలు గాఢంగా మనసుని హత్తుకుంటాయి. తూర్పు గోదావరి జిల్లా మాండలీకం,అక్కడ వ్యాప్తిలో ఉన్న అచ్చ తెలుగు మాటలు నిత్య జీవిత సంభాషణలను తన కథల్లో కి సునాయాసంగా తీసుకొస్తాడు వంశీ. గోదావరి అందలద్దుకొన్న ఈ కథలేంత కమ్మగా ఉంటాయంటే కథల్లో ఆయన రాసిన భోజన వివరాలంతగా బావుంటాయి వంశీ సాహిత్యంలో కనిపించే తిండి వివరాలు ఇంకే రచయత రాయలేరు. గోదావరిలో పడవ ప్రయాణం చేస్తూ ఆ జిల్లా వాళ్ళతో కబుర్లు చెప్పినట్లు అనిపించే ఈ కథలు తప్పకుండ చదవాలి.

Leave a comment