Categories
చాలాసార్లు తోచక ఏదైనా తినాలని పిస్తూ వుంటుంది. సెలవు పూట ఇంట్లో ఉంటే తిండి కోసం నిమిషానికోసారి ఫ్రిజ్ డోర్ తెరవటం,డబ్బాలు వెతకటం కామన్ కానీ ఇలాటి ఆకలి లేని తిండికి అలవాటుపడితే అధిక బరువు,అనారోగ్యం తప్పదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒక్కసారి మనకు బాగో లేకపోతే తియ్యగా ఏదైనా తినాలనిపిస్తుంది. వంటరిగా ఉన్నా ఆ కాన్ ఫ్యూజన్ తో ఏదోకటి తినేస్తారు. అప్పుడు ఏం తింటున్నం,ఎంత తింటున్నం అన్నా స్పృహ ఉండదు. ఏదో ఒకటి కోరుకోవటం అంతే. ఈ అధిక తిండికి మూలం మనసే. ఈ విషయం గ్రహించుకొని మరోసారి వత్తడి అనిపించినా, విసుగ్గు ఉన్నా తిండి జోలికి వెళ్ళకుండా ఇంకో వ్యాపకం ఎంచుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.