Categories
అను బందో పాధ్యాయ రాసిన బహు రూపి గాంధీ ఒక చక్కని పుస్తకం నండూరి వెంకట సుబ్బారావు గారు అనువాదం చేశారు. ఆర్కే లక్ష్మణ్ బొమ్మలతో ఉన్న ఈ చిన్న పుస్తకం పిల్లల కోసం రాసిందే అయన,పెద్దలు కూడా తప్పని సరిగా చదవాలి. మహా నాయకుడు గాంధీ ఒక సామాన్యమైన జీవితం ఎలా గాడిపారు. మలమూత్రాలు ఎత్తి పోయటం నుంచి ప్రతి పని తప్పని,అవమానకరమని భావించకుండా స్వయంగా చేసి చూపిస్తూ ఇతరులకు స్ఫూర్తి ఇచ్చారు,శారీరక శ్రమ చేయించటం,ఒక పనిని కలిసి చేయటంలో,ఐకమత్యంలో ఉండే బలం ఎంత మహా నిబ్బరాన్ని ఇస్తుందో గాంధీ జీవిత విధానం లో ఆచరించి నిరూపించారు. స్వయం పోషణతో క్రమ శిక్షణ ఎలా వస్తుందో జీవించి చూపించారు. అయన స్వయంగా క్షవరం చేసుకొనేవాడిని చదువుతుంటే ఈ లాక్ డౌన్ లో పిల్లలు ఎంతో గుర్తుకొచ్చారు. వీలైనంత త్వరగా ఈ పుస్తకాన్ని చదవండి.