రకరకాల టీలు తాగి వుంటాం. కానీ చక్కని మల్లె పూల చాయ్ కూడా వుందంటే, పైగా ఆ సువాసన టీ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఓ కప్పు తాగితే పోదా అనిపిస్తుంది. రోజు ఉదయాన్నే ఒక కప్పు మల్లె టీ తాగితే అధిక రక్త పోటు అదుపులో వుంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో చెడు కోలెస్ట్రోల్ తగ్గిపోతుంది. మల్లెపువ్వుల టీ సుగుణాల గురించి ఇప్పటికే పలు అధ్యాయనాలు ఎన్నో విషయాలు నిరోపించాయి. అన్నింటికంటే వార్ధక్వచ్చయిలు తగ్గిపోతాయి. చర్మం మెరిసిపోతుంది. జలుబు జ్వరం ఇలాంటివి వస్తే అప్పుడు ఓ కప్పు మల్లెటీ తాగితే ఇందులోని యూంబీ వైరల్, యాంటీ బాక్టిరియల్ గుణాలుఅనారోగ్యాలని అదుపులో ఉంచుతుంది. నిద్ర లేమి సమస్యను ఇది మంచి ఔషదం లాంటిదే. ఒక కప్పు టీ తోకలత లేని నిద్ర పడుతుంది. అలాగే తిన్న ఆహారం కుడా నలుపుగా జీర్ణమైపోతుంది. ఈ మల్లెపూల టీ తో పాటు ఎన్నో రకాల పూల తేనీటికీ ప్రాధాన్యత పెరిగి పోతుంది. బంతి పూల టీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందిట.

Leave a comment