Categories
శిరోజాల మెరుపుతో వుండాలన్న,రాలిపోకుండా కుదుళ్ళు బలంగా ఉండాలన్న ఆముదం చాలా బాగా పనిచేస్తుంది. వెంట్రుకలకు సరిపోయినంత ఆముదం తీసుకొని అందులో ముడు స్పూన్ల అల్లం రసం కలిపి కుదుళ్ళకు పట్టించాలి. 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే వెంట్రుకలు రాలటం తగ్గుతోంది. ఆముదంలో రెండు స్పూన్ల కలబంద గుజ్జు ముడు చుక్కల టీట్రీ ఆయిల్,బాగా కలిపి గిలకొట్టి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి ఓ అరగంట ఆగి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గిపోయి,జుట్టు కుదుళ్ళు బలపడతాయి ఆముదం బాదం నూనెలు సమపాళ్ళలో తీసుకొని కాస్త వేడి చేసి అందులో రెండు ముడు చుక్కల రోజ్ మేర్ ఆయిల్ కలిపి తలకు పట్టించి అరగంట ఆగి తలస్నాన చేస్తే వెంట్రుకలు వత్తుగా పెరుగుతాయి.