Categories
Nemalika

సంతోషాన్ని వెతికి గుప్పెట్లో పెట్టాలి.

నీహారికా,

నడిచే మార్గంలో ఎత్తుపల్లాలు ఎంత సహజమో జీవితంలో వాడిదుడుకులు అంటే సహజం. ఏదయినా జీవితంలో చిన్నపాటి కష్టం ఎదురైనా కంగారుపడి పోవడం మనవ నైజం. కానీ సమస్యను సమస్యలా చూడకుండా, ఇలాంటివి ఎదురుకోవడం మానవనైజం. కానీ అనుకుని ప్రశాంతంగా ఆ సమస్యకు పరిష్కారం వెదకకుండా వట్టినే దిగులుపడటం ఆన్ లైన్ ఫెయిల్యూర్. ఎలాంటి కస్టాలున్నా ధైర్యంగా ఎదుర్కోవడం మనస్ధరైర్యాన్ని మనోనిబ్బరాన్ని ఇస్తుంది. మారధనలో సమస్యతో పాటు పరుగులు పెడితే పరిస్థితి మరింత చిక్కుముళ్ళు పడిపోతుంది. దీన్ని అతిగా తీసుకోకూడదు. జీవితం ఏదిచ్చినాదాన్ని యధాతధంగా తీసుకోగలిగిన స్థితి ప్రజ్ఞత కావాలి. మన జీవితానికి మనమే బాధ్యులం. ఆనంద విశాదాలన్నీమనదే బాధ్యత అని తెలుసుకోగలిగితే హాయిగా ఆనందంగా ఎలా ఉండాలో తెలిసిపోతుంది. అనుభావాలనుంచే గుణపాటాలు నేర్చుకోవాలి. జీవితం ఒక రహస్యం పరిశోదించాలి. జేవితం ఓ సాహసం. ధైర్యంగా ఎదుర్కోవాలి. జీవితం అంటే ప్రేమా ఆస్వాదించాలి.

Leave a comment