Categories
చక్కని రుచి రుచే కాదు అంతకు మించిన ఆరోగ్య లాభాలు ఉన్నాయి కమల పండ్లలో అంటారు ఎక్సపర్ట్స్. ప్రపంచ వ్యాప్తంగా ఏడున్నర కోట్ల టన్నుల ఆరెంజెస్ ఉత్పత్తి అవుతున్నాయి. రోగులకు ఆపిల్స్ తో పాటు ఇవ్వా ల్సింది కమలాలే. రోజుకి ఒక గ్లాస్ కమల రసం తాగితే మంచి కొలెస్ట్రాల్,ఫోలేట్ ల శాతం పెరిగినట్లు పరిశోధనలు తెచ్చాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ అనారోగ్యాల్ని నియంత్రిస్తాయి వయసుని మీద పడనీయ కుండా చేస్తాయి. పీచు ఎంతో ఎక్కువ. కమలాల్లోని కెరోటినాయిడ్ల విటమిన్ -ఎ గా మారి వయసుతో పాటు వచ్చే మాక్యులర్ జనరేషన్ ను తగ్గిస్తాయి. సిట్రస్ జాతుల్లో ఇది అందరికీ ఫెవరేట్ ఫ్రూట్.