కరోనా సంక్షోభం కన్నా నాకు వలస కార్మికుల సంక్షోభం పెద్దదిగా అనిపించింది అంటున్నారు మహిళా జర్నలిస్ట్ బర్ఖా దత్ దేశవ్యాప్తంగా వలస కార్మికుల వేలాది కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ ఉంటే వారి యాతన ప్రపంచానికి తెలిసేలా గా 74 రోజులు 8 రాష్ట్రాలు 14 వేల కిలోమీటర్లు తన బృందంతో కలిసి ప్రయాణం చేసింది బర్ఖా దత్. వలస కార్మికుల తో పాటు ట్రక్కుల్లో రైళ్లలో వాళ్ళతో మాట్లాడటం. ఇండోర్ లోని  కోవిడ్ 19 ఆస్పత్రిలోని శవాగారం లోని పి ఈ ఈ కిట్  ధరించి వెళ్లటం వంటి సాహసాలు చేశారామె దేశ విభజన తర్వాత జరిగిన అతిపెద్ద వలసలు ఇవే దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులు విషయంలో ఒక పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు.

Leave a comment