యాంటీ బయోటిక్స్ వాడితే ఆరోగ్యపరంగా అధికంగా ఎన్నో రకాల నష్టాలు జరుగుతాయి అంటున్నారు డాక్టర్లు.దగ్గు, జలుబు వంటి వాటికి యాంటీబయోటిక్స్ ఇస్తుంటారు.ఈ కరోనా సమయంలో వాటిని వినియోగించ వద్దనే అంటున్నారు డాక్టర్లు. చర్మంపైన అనేక రకాలు బ్యాక్టీరియా జీవిస్తుంది. వాస్తవానికి అవి హాని చేసేవి కావు యాంటీబయోటిక్స్ తరచుగా వాడితే చర్మం పైన ఉన్న హాని లేని బ్యాక్టీరియా నశించిపోతుంది. రోగకారక క్రిములు యాంటీబయోటిక్స్ తమపై పని చేయని విధంగా నిరోధకతను పెంచుకుంటాయి.ఇది వారిలో యాంటీ బయోటిక్స్ కు లొంగే టీబీ, క్లేబ్సియెల్లా న్యుమోనియా, సూడోమోనాస్ వంటి సూక్ష్మ క్రిములు ఇప్పుడు మొండిగా మారిపోయాయి.అందుకు సాధారణ జలుబు జ్వరం వచ్చినా యాంటీబయోటిక్స్  వాడకండి అంటున్నారు డాక్టర్లు.

Leave a comment