జుట్టు కుదుళ్లు బలంగా ఉండేందుకు ఉల్లి రసం కలిపిన షాంపూలు కూడా వస్తున్నాయి. ఉల్లి రసం లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటి మైక్రోబియల్ గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంట్లోనే ఉల్లి రసం తయారు చేసుకొని వాడుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయ కోసి మిక్సీలో వేసి ఆ గుజ్జును ఒక మెత్తని వస్త్రంలో వడబోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.రెండు టీ స్పూన్లు ఉల్లి రసం టీ లో స్పూన్ తేనె  కలిపి  ఈ మిశ్రమాన్ని హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు. ఓ అరగంట అలా వదిలేసి తలస్నానం చేయాలి.  ఇలా చేస్తే కుదుళ్లు బలంగా అవుతాయి. అలాగే ఉల్లిరసంలో ఆముదం కలిపి తలకు పట్టించి తలస్నానం చేయాలి.ఈ రెండింటి లోని ఆంటీ ఇన్ఫ్లమేషన్  ఆంటీ మైక్రోబియల్ గుణాలు ఇన్  ఇన్ఫెక్షన్ల ని  తగ్గిస్తాయి. ఉల్లిరసం దురదగా అనిపిస్తే అందులో అలోవెరా, కొబ్బరి నూనె లేదా తేనె కలుపుకోవచ్చు లేదా లావెండర్, టెర్రీ ఆయిల్ కలిపితే ఉల్లి వాసన తగ్గుతోంది .

Leave a comment