Categories
మొటిమలతో ముఖం పైన మచ్చలు గుంటలు పడితే ఈ ట్రీట్ మెంట్ మంచి ఫలితం ఇస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. తేనె,చెక్కర సమపాళ్ళలో తీసుకొని కళ్ళ చుట్టు కాస్త వదిలేసి ముఖానికి,మెడకు వలయాకారంగా మర్దన చేయాలి. ఇది చర్మానికి నునుపుదనం తేవటం తో పాటు మృత కణాలు తొలిగిస్తుంది. మొటిమలతో గుంటలు పడిన చర్మం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తుంది. రెండు స్పూన్ల తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి ఆ మిశ్రమం రాత్రి వేళ ముఖానికి అప్లయ్ చేసి ఒక 20 నిముషాలు మెల్లగా మసాజ్ చేయాలి. గోరు వెచ్చని నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా రెండు రోజుల కొకసారి చేసినా మంచి ఫలితం ఉంటుంది.