Categories
వర్షా కలం శీతా కాలం ఎసి వాడకం కాస్త తక్కువ గనుక వేసవి ముందే క్లీన్ చేయించు కోవటం చాలా మంచిది సాధారణంగా ఎయిర్ కండిషనర్ ఫిల్టర్ ను నెలకోసారి మార్చాలి. అప్పుడే యూనిట్ లోంచి గదిలోకి గాలి ధారాళంగా వస్తుంది. యూనిట్ లో అవరోధాలు వుండే గది చల్లబరిచేందుకు ఎక్కువ సమయం తీసుకొంటుంది. ఎసి డ్రైయిన్ లైన్ కూడా క్లీన్ చేయించాలి. గది చల్ల బరిచే క్రమంలో ఎసిలు గాలి నుంచి నీటిని వేరు చేస్తాయి. ఈ నీరు బయటికి పోయేందుకు డ్రైయిన్ పైప్స్ ఉంటాయి. వీటిలో నాచు చేరితే నీరు బయటకు పోకుండా లీక్ అవుతు ఉంటుంది. లేదా నీరు ఎసి యూనిట్ లోకి వెనుకకి వస్తుంది. అలాగే డ్రైయిన్ లైన్ లో పైప్ లో కొద్దిగా నీళ్ళు పోసి బయటికి వస్తున్నాయో లేదో చెక్ చేయాలి