Categories
రాసిల్క్ తో కుట్టి పైన చక్కని ఎంబ్రాయిడరీ చేసిన పోట్లీ బాగ్స్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ గా బాగా పాపులర్ అయ్యాయి . బేబీ షోవర్లు,పుట్టిన రోజులు ,పండగలు కిట్టి పార్టీ గిఫ్టులు గా పోట్లీ బాగ్స్ చాలా ఆదరణ పొందుతున్నాయి . పైన వెల్వట్ తో లోపల సాటిన్ తో పైన మెరిసిపోయే బంగారు, వెండి దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన ఈ బాగ్ లు చాలా అందంగా ఉంటాయి . కొన్ని ముత్యాల వరసల్ని కలిపి హ్యాంగింగ్స్ గా తయారు చేసిన అందమైన గుజరాతీ స్టయిల్ బాగ్స్ ఏ దుస్తుల మీదకైనా మ్యాచింగ్ గా ఉంటాయి . లోపల మరిన్ని కంపార్ట్ మెంట్స్ లేకుండా విశాలంగా అవసరమైన ఫోన్ ,లిప్ స్టిక్ వంటివి పట్టేలా ఉన్న ఈ పోట్లీ బ్యాగ్స్ ,బంగారు అంచుల అలంకరణలో ఎంతో అందంగా ఉన్నాయి .