Categories
ఇల్లేంత మోడర్న్ గా తీర్చి దిద్దిన పడక గది విషయం వచ్చేసరికి పాతకాలపు పందిరి మంచాలకే ప్రయారిటీ ఇస్తున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. 16 వ శతాబ్దంలో చైనా ఫ్రాన్స్,ఇంగ్లాండ్ వంటి దేశాల్లో వీటిని అద్భుతమైన కళాఖండాలుగా మలిచే వాళ్ళు. దేవదారు జింక్,రోజ్ వుడ్,వాల్ నట్ వంటి ఖరీదైన చుక్కలతో బంగారు వెండి ఇత్తడి నగిషీలతో ఎత్తుగా మెట్ల వరుసలతో గొప్ప పనితనం తో నింపేవారు. కేవోపీ రకం మంచాల్లో అయితే ఇందులో చెక్క డిజైన్ కన్న పందిరికి అలంకరించే పరదాల్లో ఎంతో క్రియేటివిటీ ఆడంబరాన్ని చూపించే వాళ్ళు ఇప్పటికి శతాబ్దాలు గడుస్తున్నా పడక గదికి మాత్రం అందమైన పందిరి మంచానికి మించిన ఆకర్షణ ఇంకొటి లేదు.