Categories
భావోద్రేక ప్రక్రియలో మెదడులోని విభిన్న ప్రదేశాలకు సంగీతానికి నడుమ అత్యున్నత స్థాయిలో భాందవ్యం ఉంటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి సంగీతం వింటూ ఉంటే ఎండార్షిన్ ,మెలాటోనిక్ వంటి న్యూరో హార్మోన్లు విడుదల అవుతాయి . ఇవన్నీ ఆహ్లాదాన్ని కలిగించే హార్మోన్లు . సంగీతం ప్రభావం ఆరు రకాలుగా ఉంటుంది . విటున్నపుడు ఏకాగ్రత పెరగటం మంచి మూడ్ రావటం ఒక మంచి వాతావరణం లో ఉన్నట్లు అనిపించటం కళా ప్రక్రియ ,వ్యాల్యుమ్ అన్ని కలసి రిలాక్సేషన్ అందిస్తాయి . మెదడు ఉద్దప్తమవుతుంది . యాంగ్జయిటీ ,ఎగ్జాయిట్ మెంట్ నుంచి ఉపశమనం కలుగుతుంది . ఎన్నో మానసిక రుగ్మతలకు సంగీతం ఒక పరిష్కారం .