Categories
మనలో ఎవరైనా తాతముత్తాతల పేర్లు ఏమిటి అని అడిగితే చెపుతారు కానీ అంతకంటే వెనక్కపోయి ముత్తాత తాత ఎవరంటే చెప్పలేకపోతారు. కానీ అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన గాలో తెగ ప్రజలు మాత్రం సునాయాసంగా 20 తరాల పేర్లు చెప్పేస్తారు. పేర్లు గుర్తు పెట్టుకోవటంలో వీళ్ళు ఒక పద్ధతి కని పెట్టారు. తండ్రి పేరు లోని చివరి అక్షరాన్ని అతని కొడుకు పేరులో మొదటి అక్షరంగా పెడతారు. ఉదాహరణకు ఒకతని పేరు తని అయితే కొడుకు పేరు నితో,నితో కొడుకు తోపో,అతని కొడుకు పోయి ఇలా వరసగా వస్తాయి. మొదటి అక్షరం తండ్రి పేరు కావటం వల్ల ఆ పేరు మళ్ళి మళ్ళి వస్తూ ఇరవై తరాలు పేర్లను గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. పూర్వీకులకు ఈ తెగ ఇచ్చే మర్యాద ఇది.