Categories
స్మార్ ఫోన్ వాడకం తో ఎలాటి అనర్దాలుంటున్నాయో తెలుసుకొనేందుకు చేసిన ఒక అధ్యయనంలో ఈ ఫోన్ వాడకంలో డిప్రషన్ అవకాశాలు ఉంటాయని తేలింది . స్మార్ ఫోన్ తో నిరంతరం సోషల్ మీడియాలో, సంబంధాలతో ఉండటం తో ,నిద్ర తక్కువ కావటం ,శరీరం అలసట కు గురికావటం తో డిప్రషన్ బారిన పడుతున్నారంటున్నారు . ఉద్యోగ సమయం,తరువాత పూర్తికాలం స్మార్ ఫోన్ తో గడపటంలో విశ్రంతి లేకుండా ఉంటున్నారనీ దానివల్ల శారీరక అనారోగ్యాలతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయంటున్నారు . శృతి మించి వాడితే డిప్రషన్ లో ఆత్మహత్య ఆలోచనలు వస్తాయని ,అందుకే దేన్నయినా పరిమితం గానే ఉంచుకోవాలని శాస్త్రవేత్తలు చెపుతున్నారు .