Categories
అమ్మాయిలకు లెహంగా ఎప్పుడు ఇష్టమే మిర్రర్ వర్క్ తో ఉండే లెహంగాలు వేడుకల్లో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి లెహంగా పైన ఫ్లవర్ వర్క్. బ్లౌజ్ మెడ దగ్గర భారీ మిర్రర్ వర్క్ ఉంటే సాయంకాలపు వేడుకల్లో మెరిసిపోవచ్చు. లెహంగా తో పాటు బ్లౌజ్ పైన పూర్తి మిర్రర్ వర్క్ సమంగా పరుచుకొనేలా ఉంటే అప్పుడు ఆడ్రెస్ పైన ప్లేయిన్ కలర్ చున్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మిర్రర్ వర్క్ హైలైట్ అవుతోంది. లెహంగాపైన వేరువేరు రంగుల మిర్రర్ వర్క్ కూడా చాలా చక్కగా ఉంటుంది అప్పుడు లేత రంగు లెహంగా ఎంచుకొంటే మల్టీ ఫుల్ కలర్స్ లో మిర్రర్ వర్క్ సరికొత్తగా కనిపిస్తుంది. సింపుల్ గా ఉండాలి అనుకొంటే అంచుల వరకే మిర్రర్ వర్క్ చేయించుకొంటే సరిపోతుంది.