ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న ఈ ఆలయం రామగిరి కొండలలో శబరి నది ఒడ్డున గుప్తేశ్వర గుహలో స్వయంభువుగా వెలసి చాలా అరుదుగా శివరాత్రి రోజు మాత్రమే మనకు దర్శన భాగ్యం కలుగుతుంది.పూర్వం శ్రీరామలక్ష్మణులు అరణ్యవాసం చేసినప్పుడు ఈ ప్రాంతంలో పంచవటి సమీపంలో ఉండి శివారాధన చేసేవారట.త్రేతాయుగంలో వెలసి కలియుగములో పూజలు అందుకుంటాను అని రాములవారికి జయము సిద్ధిస్తుందని స్వయాన శివుడు పలికాడుట.ఇక్కడ సీతగుండం అని ఉంది అక్కడ సీతామ్మవారు స్నానం చేసిందని అంటారు. ఈ గుండంలో స్నానం చేస్తే సర్వవ్యాధి నివారణ అని ప్రత్యక్ష ఆధారాలు ఉన్నాయి.ఈ ఆలయం 50 సంవత్సరాలకు ఒకసారి శివరాత్రిరోజున తీస్తారుట.

నిత్య ప్రసాదం:కొబ్బరి,పంచాభిషేకాలు

-తోలేటి వెంకట శిరీష

Leave a comment