లాక్ డౌన్ తో అందరూ ఇంట్లోనే మంచి సినిమాలు చూడాలంటే స్మితా పాటిల్ నటించిన ఆజ్ కీ ఆవాజ్ సినిమా చూడవచ్చు .రాజ్ బబ్బర్ ఒక ప్రొఫెసర్ బొంబాయికి కుటుంబం తో సహా వస్తాడు .స్మిత లాయర్ ఇద్దరికీ పెళ్ళి నిర్చయం అవుతుంది .ఒక హత్య కేసులో ఇన్ఫార్మర్ అయినందు వల్ల ప్రతీకార చర్య గా రాజ్ బబ్బర్ చెల్లెలని అతని ముందే రేప్ చేసి అతని తల్లి చంపేస్తారు .చట్టం లోని లొసుగులతో వాళ్ళు తప్పించుకొంటారని అర్ధం చేసుకొని తానే ఆ రౌడీలను చంపేస్తాడు రాజ్ బబ్బర్ .లాయర్ గా స్మితా పాటిల్ అపురూపమైన నటన కనపరిచింది ఈ సినిమాలో .తప్పకుండా ఈ సినిమా చుడండి .

Leave a comment