Categories
ముఖాకృతిని బట్టి కనుబొమ్మల షేప్ చేయాలాంటారు ఎక్స్ పర్డ్స్ .కోలముఖం అయితే నుదుటి మధ్యభాగం నుంచి ఐబ్రోస్ ను స్ట్రయిట్ చేసి వంపు తిప్పాలి. గుండ్రని మొహానికి ఎక్కువ వంపు ఉండేలా షేప్ చేయాలి ఒక ఆర్ట్ లాగా వేస్తే ముఖం మరింత గుండ్రంగా అందంగా కనిపిస్తుంది . పొడుగు ముఖం ఉన్నవాళ్ళు కు అంతా ఈక్వల్ గా ఉండే షేప్ బావుంటుంది .మొహం పొడుగ్గా కనబడకుండా ఉంటుంది .చతురస్త్రాకార మొహం అయితే ఐబ్రోస్ ఒత్తుగా ఉంచుకోవాలి .హృదయకారం మొహం అయితే ఐబ్రోస్ గుండ్రంగా చేయించుకోవాలి .కళ్ళు ఏ ఆకారంలో ఉన్నా కాను బొమ్మలకు చక్కని ఆకృతి ఇస్తే ముఖం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.