సుగంధ ద్రవ్యాలు కొనేప్పుడు కల్తీ లేని తాజావి ఎంచుకోవాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి.దాల్చిన చెక్కల్లో సిసలైనది సిలాన్ సినమన్. ఇది పలుచగా ఘాటుగా ఉంటుంది. నల్ల మిరియాలు నలిపి చూస్తే పెద్ద ముక్కలుగా విరిగితే చేతికి నూనె అంటుకుంటే అవి మంచివి కారం కాస్త నీళ్లలో పడేస్తే నీళ్ల రంగు మారితే ఆ కారం కల్తీదే.తాజా యాలుకలు ఆలివ్ లేదా ఆకుపచ్చ రంగులో ఉబెత్తుగా ఉంటాయి. మరీ ముదురు ఆకుపచ్చ గా ఉంటే వాటికి రంగు కలిపారని అర్థం.తాజా లవంగాలు నీళ్ళలో వేస్తే నిలువుగా తేలితే అవి మంచివి. పసుపు కాస్త నీళ్ళలో వేస్తే, నీళ్ల పైన తెల్లని పలుకులు తేలితే అది కల్తీదని అర్థం.

Leave a comment