కొంత మంది తమ జీవిత విధానంలోనే భావితరాలకు స్ఫూర్తిని ఇస్తారు .కృష్ణ జిల్లా గుడివాడలో లక్ష్మి నారాయణ , సుబ్బ లక్ష్మి దంపతులకు జన్మించిన లంకా అన్నపూర్ణ దేవి ప్రముఖ నాట్య కళాకారిణి .వందలకొద్దీ ప్రదర్శనలు ఇచ్చారామె .చైనా , భారత్ యుద్ధ సమయంలో దేశ సరిహద్దుల వరకు వెళ్ళి సైనికులలో ఉత్తేజం నింపేలా నాట్య ప్రదర్శన ఇచ్చేవారు . 1973 లో జరిగిన రైలు ప్రమాదంలో ఒక కాలు మోకాలి వరకు తెగిపోయింది మరోకాలు మడమ వరకు దెబ్బ తిన్నది .ఆ తరువాత కొయ్య కాలు అమర్చుకొని దేశ వ్యాప్తంగా 200 వరకు ప్రదర్శనలు ఇచ్చారు .నెహ్రూ, సర్వేపల్లి ,ఇందిరా గాంధీ అభినందించారు .అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో మృతి చెందారు .నాట్య మయూరికి ఎంతోమంది నివాళులు అర్పించారు .

Leave a comment