రష్యాలోని మాస్కోలో కియా వాస్కాయ అనే మెట్రో స్టేషన్ వుంది. అసలది స్టేషన్ గా అనిపించదు రాజుల కాలంలో అంతఃపురంల్లో ఉండే దర్బార్ హల్ లాగా ఉంటుంది. రాజులు మంత్రులు కూర్చునేందుకు సింహాసనాలు,షాండ్లియర్స్ తో అచ్చం రాజభవనం లాగే ఉంటుంది. అయితే ఆ ప్రదేశాల్లో ప్రయాణీకులు కూర్చొని కనిపిస్తారు. బంగారు రంగు గోడలు,నగిషీలు చెక్కిన గోడలు చక్కని సింహాసనాల్లాంటి కుర్చీల తో ఈ మెట్రో స్టేషన్ ప్రపంచంలో కెల్లా అత్యంత సుందరమైనది. ఈ మధ్య కాలంలో కొత్త హంగులతో నిర్మించినది కాదు దీన్ని 1954 లో కట్టారు.