స్వచ్ఛమైన గాలి అందించే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యం అని రికమెండ్ చేస్తోంది నాసా పరిశోధన కేంద్రం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవటం చాలా అవసరం అరేకా ఫామ్ ను కిటికీల దగ్గరగా ఉంచి పెంచితే రాత్రివేళ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇంట్లో ఉన్న కాలుష్యాన్ని గ్రహిస్తుంది .రాపిడ్ ఫామ్ మొక్క పిల్లలు చదువుకునే ప్రదేశాల్లో పడక గదుల్లో పెడితే ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుంది .ఇక స్పైడర్ ప్లాంట్ గదిలో ఉన్న దుమ్మును గ్రహిస్తుంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావు .ఇంట్లో కనిపించని దుమ్ము గ్రహించే శక్తి ఈ మొక్కకు ఉంటుంది .చింగో నియిం మొక్క పసి పిల్లలు ఉన్న ఇంట్లో తప్పకుండా పెంచాలి. ప్యూర్ ఆక్సిజన్ ఇచ్చే ఈ మొక్క చిల్డ్రన్స్ హాస్పిటల్స్ లో పెడితే ఎంతో మంచిది గాలి శుభ్రం చేసే మొక్కల్లో బ్యాంబూ ప్లాంట్ కూడా ఒకటి . సాంగ్ ఆఫ్ ఇండియా ప్లాంట్ యాంటీ డస్ట్ రిమూవర్ ప్లాంట్ అని పిలుస్తారు. ఉష్ణోగ్రతను కూడా నియంత్రించగలగుతోంది అని అంటారు. పీస్ లిల్లీ మొక్క ఇంట్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు .వెలుతురు చీకటి తో సంబంధం లేకుండా ఎక్కడైనా పెరిగే మొక్క ఇది .పుస్తకాల వాసన వచ్చే గదుల్లో దాన్ని గ్రహించేలా చేస్తుంది స్నేక్ ప్లాంట్. లైబ్రరీ లో ఉంచుకోదగ్గది ఈ మొక్క. ఈ కరోనా సమయంలో రోగ నిరోధక శక్తిని ఇచ్చే ఆహారంతో పాటు స్వచ్ఛమైన గాలి కూడా చాలా అవసరం కూడా.
Categories