సినిమాల్లో విలన్ గా ప్రసిద్ధి చెందిన సోనుసూద్ ఇప్పుడు ఈ కరోనా సమయంలో సాయంతో కర్ణుడంత వాడు అనిపించుకొన్నాడు మోడలింగ్ తో మొదలుపెట్టి సినిమా నటుడైన సోనుసూద్ సోనాలీ ని పెళ్లి చేసుకున్నాడు .ఇషాన్, అయాన్ అన్న ఇద్దరు పిల్లల తండ్రి. కరోనా సమయంలో హైవే లో నడుస్తున్న కార్మికుల కష్టాలు చూసి చలించి పోయిన సోనుసూద్, వాళ్ళ కోసం ఆహారం, రవాణా సౌకర్యం కల్పించడం కోసం సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు .కొన్ని వేల మందికి సహాయం అందించారు అతని సేవా దృక్పధాన్ని చూసి చెల్లించి పోయాన ఎయిర్ లైన్స్ వాళ్ళ స్పెయిస్ జెట్ బోయింగ్ 737 పైన సెల్యూట్ టు ది సేవియర్ అని రాసి అతని బొమ్మ ప్రింట్ వేశారు. అతని దాతృత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పాడు .ఇంత చేసినా తనను పొగడ్తలతో ముంచెత్తవద్దనే అంటాడీ సినిమా విలన్. రిజర్వేషన్ లేని టికెట్ తో మొగా నుంచి ముంబై కి ప్రయాణం చేసి వచ్చిన రోజును నేను మరలి పోను అంటారు వినయంగా నటుడు కావాలనే నా కల నెరవేరింది. నేను సంపాదించిన దానిలో కొద్ది మొత్తం కష్టాల్లో ఉన్నవాళ్ల కోసం ఖర్చు చేయటం గొప్ప విషయం ఏమి కాదంటాడు. ప్రపంచం గుర్తించిన ఈ దాన కర్ణుడుని సాయం కోరుతూ దేశం నలుమూలల నుంచి అభ్యర్థనలు వెల్లువగా వస్తూనే ఉన్నాయి. నాకు చేతనైనంత చేస్తున్నాను. మా పిల్లలు, భార్య సోనాలి తోడు లేకుండా నేను ఇవేమీ చేయలేను. వాళ్లే నాకు అండ అంటాడు సోనుసూద్ .
Categories