పడుకొనే ముందర కొన్ని ఓట్స్ ఉడికించి గోరు వెచ్చని పాలతో కలిపి తింటే అందులోని సంక్లిష్ట పదార్దాలు వల్ల మత్తుగా అనిపించి నిద్ర వస్తుంది అంటారు ఎక్సపర్ట్స్. ఓట్స్ లో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ ఒత్తిడిని తగ్గించే విటమిన్ బి6 లు కూడా పుష్కలంగా ఉంటాయి గుప్పేడు బాదం పప్పులు తిన్నా వాటిలో నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్ హార్మోన్,మెగ్నీషియం ఖనిజం సంవృద్ధిగా ఉంటాయి. అరటి పండులో నిద్రను ప్రభావితం చేసే సెరటోనిన్ శాతం ఎంతో ఎక్కువ. ఛమేలీ పూలతో చేసిన టీ,గోరు వెచ్చని పాలు వంటివి నిద్రనిచ్చే ఆహారం నిద్ర మాత్రలు లేకుండా సహజంగా నిద్ర నిచ్చే ఆహారం తీసుకోమంటున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment