వేప పువ్వు చేదు వాసన తో తెల్లగా ఉంటుంది. వేప లో వుండే ఔషధ గుణాలు పూలల్లో కూడా ఉంటాయి. ఉదా రంగులో ఉండే వేప పూలు కూడా పూస్తాయి. ఆగ్నేయసియ,దేశాల్లో ను తూర్పు భారతం లోను ఎక్కువగా పెరిగే ఈ ఉదా రంగు వేపపూల చెట్టు కూడా వేప వంటి ఔషధ గుణాలు ఉన్నవే. ఈ ఉదా రంగు వేప పూలని తలకు రుద్దుకొంటే తలనొప్పి తగ్గుతోంది. ఈ వేప గింజల నూనె మెదుడికి మంచి మందు మాత్రమే కాదు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తుంది. ఈ వేప చెట్టు కలపకు చెదలు కీటకాలు చేరవు. ఈ వేప పూతను,వేప చెట్టు బెరడు,ఆకులు చిగుళ్ళు అనేక వ్యాధుల నివారణలో వాడుతు ఉంటారు. ఈ వేప చెట్టును ఘూరా నీమ్,చైనా చెర్రీ ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇండియన్ లిలియాక్ అని పిలుస్తారు.

Leave a comment